జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 21 at 1.37.49 PM

TRINETHRAM NEWS

BSNL కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ రూ.48తో నెల మొత్తం డేటా , కాల్స్

BSNL కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ రూ.48 ను కనీస డేటా, కాలింగ్ అవసరాలకోసం వినియోగదారులకు అందిస్తోంది.తక్కువ ఖర్చుతో నెల రోజుల మొబైల్ సేవను కోరుకునే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ వంటి ప్రముఖ టెలికం నెట్ వర్క్ ప్రొవైడర్లతో పోల్చినప్పుడు వినియోగదారుల బేస్ తక్కువగా ఉన్నప్పటికీ BSNL స్థిరమైన బలమైన ఆర్థిక ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని కోరుకునే వినియోగదారుల కోసం BSNL రూ. 50 కంటే తక్కువ ప్లాన్ తో ముందుకు వచ్చింది.

BSNL కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్.. రూ.48

BSNL కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ రూ.48 .. తక్కువ ఖర్చుతో నెల రోజుల మొబైల్ సేవను కోరుకునే వారికి ఇది మంచి ప్లాన్. రూ.48 తో 30 రోజుల చెల్లుబాటు, అంతరాయం లేని సేవను అందిస్తోంది. కాల్స్ చేసుకునేందుకు 10 రూపాయల టాక్ టైమ్ బ్యాలెన్స్ పొందుతారు. నిమిషానికి 20 పైసల చొప్పున ఇంటర్నెట్ ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ తో పాటు నిర్ధిష్ట సర్కిల్స్ లో అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

You cannot copy content of this page