TRINETHRAM NEWS

కార్యకర్తలకు అండగా brs పార్టీ

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్
-బీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా ధీమా
-కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్టం అభివృద్ధి పథంలో ప్రయాణం
-ప్రభుత్వం 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటూ సవాలక్ష కండీషన్లు పెట్టి, జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపున్నది రేవంత్ ప్రభుత్వం.
-ఎకరానికి 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమే.
-నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ ను రైతన్నలు పాతరేస్తారు.
-మోసం అనే పదం చిన్నదైపోతది. దగా, నయవంచన పదాలు కూడా సరిపోవు
-కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతది.
-కపట నాటకాలకు, నోరు తెరిస్తే అబద్ధాలకు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతాంగానికి అర్థమైపోయింది.
-తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతుద్రోహిగా మిగిలిపోతాడు
-డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారు
-రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది. ఎందుకు సంబరాలు చేయాలి రైతన్నలకు 15000 ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుకా
-కేసీఆర్ రైతుబంధుగా నిలిచారు. రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారు
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ భరోసా ఇచ్చారు. కొండమల్లెపల్లి మండలం చిన్నఆడిశర్లపల్లి గ్రామానికి చెందిన రావుల వెంకటయ్య బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని పొందారు. రావుల వెంకటయ్య కరెంట్ షాక్ తో మృతి చెందారు. రావుల వెంకటయ్య బీఆర్ఎస్ లో సభ్యత్వాన్ని పొందిన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలిచింది.సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందిన రూ.2 లక్షల బీమా చెక్కును నామినీ కుమారుడు రావుల రమేష్ కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చిన్నఆడిశర్లపల్లి గ్రామంలో ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రభుత్వం 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటూ సవాలక్ష కండీషన్లు పెట్టి, జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపున్నది రేవంత్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు . ఎకరానికి 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమే. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరు అని అన్నారు.

నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ ను రైతన్నలు పాతరేస్తారు అని తెలిపారు. మోసం అనే పదం చిన్నదైపోతది. దగా, నయవంచన పదాలు కూడా సరిపోవు అని ఆయన అన్నారు.కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతది అని అన్నారు కపట నాటకాలకు, నోరు తెరిస్తే అబద్ధాలకు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతాంగానికి అర్థమైపోయింది అని ఆయన తెలిపారు తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతుద్రోహిగా మిగిలిపోతాడు అని తెలిపారు.డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారు అని గుర్తు చేశారు.రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది. ఎందుకు సంబరాలు చేయాలి రైతన్నలకు 15000 ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుకా? అని ఆయన అన్నారు.ఉద్యమ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించి రాజకీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలందరికీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్టం అభివృద్ధి పథంలో పయనించిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్తలెవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందినట్టైతే నామినికీ రూ.2 లక్షల బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ అందజేస్తున్నదని అన్నారు.కేసీఆర్ రైతుబంధుగా నిలిచారు. రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కేసాని లింగా రెడ్డి, రావుల వెంకటేశ్వర్లు,వస్కుల కృష్ణయ్య, గుండాల రాజేష్,వాడిత్య బాలు,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App