Groom Murdered : పొట్టిగా ఉన్నాడని బావను చంపిన బావమరిది

TRINETHRAM NEWS

గుంటూరులో పెళ్ళైన 10 రోజులకే వరుడి హత్య

Trinethram News : బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్‌కు, దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతితో పెళ్లి సంబంధం కోసం వెళ్లిన కుటుంబసభ్యులు.. కుర్రా గణేష్ పొట్టిగా ఉన్నాడని పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు.. కానీ మొదటి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డ కుర్రా గణేష్, కీర్తి అంజనీ దేవి

ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకొని, రోజు ఫోన్ మాట్లాడుకుంటూ దగ్గరైన వీరిద్దరూ.. పెద్దలు ఒప్పుకోవడం లేదని పారిపోయి 10 రోజుల క్రితం అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. పొట్టిగా ఉన్నాడని, తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని గణేష్ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చిన యువతి సోదరుడు దుర్గారావు.. తనకు యువతి కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులను ఆశ్రయించిన గణేష్

పెళ్లి గుడిలో చేసుకున్నానని, రిసెప్షన్ గ్రాండ్‌గా చేసుకోవాలని బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్తున్న బావ గణేష్‌ను, నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపిన బావమరిది దుర్గారావు.. దుర్గారావును అతని స్నేహితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణలో బావ పొట్టిగా ఉన్నాడని, తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని అందుకే చంపానని ఒప్పుకున్న దుర్గారావు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Brother-in-law kills brother-in-law

You cannot copy content of this page

Scroll to Top