జూలై 7, 2026

WhatsApp Image 2024 03 19 at 18.30.59

TRINETHRAM NEWS

Trinethram News : కొత్తగూడెం :మార్చి 19
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన వేళ దేశ ఓటర్లకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది.

దగాకోరు సార్వ‌త్రిక ఎన్నిక లను బహిష్కరించండి. బ్రహ్మణీయ, హిందూ త్వ ఫాసిస్టు బీజేపీని, దానితో అంటకాగుతున్న పార్టీలన్నిం టినీ తన్ని తరమండి. బ్రహ్మ ణీయ, హిందూత్వ, ఫాసిస్టు ప్రమాదం నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడండి. భాతర నూతన ప్రజా స్వామిక విప్లవాన్ని పురోగమింపజేయండి. ప్రజల విప్లవ రాజకీయా ధికారాన్ని స్థాపించండి’అని లేఖలో పేర్కొన్నారు.

నవంబర్‌లో జరిగిన తెలం గాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ఓట్ల కోసం వేల కోట్లు డబ్బు, మద్యం పంచి పెట్టారు. ఇప్పుడు అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధికారాన్ని చేపట్టడం కోసం ధనబలం, కండబలం, కుల, మత రాజకీయాలతో సిద్ధమ య్యారు.

మతతత్వ రాజకీయాలతో పార్లమెంట్ వ్యవస్థను మరోసారి అపహస్యం చేయడానికి పూనుకు న్నారు. అలాంటి స్వార్థ పరులకు బుద్ధి చెప్పాలి’ అని లేఖలో పిలుపు నిచ్చారు.

You cannot copy content of this page