TRINETHRAM NEWS

ప్రెస్ నోట్, తేది 06.02.2024

• మా ఎంపి గారు జనసేన పార్టీ లో చేరినప్పుడు సి.ఎం. జగన్ సార్ అబద్ధాలు చెబుతాడు అని అయన ఒక్కడే మొదటిసారి అనలేదు. చాలా మంది మీ నాయకులే , చాలా సార్లు గతంలో ఆ విషయం చెప్పారు. జగన్ సొంత చెల్లెలు షర్మిలమ్మ కుడా మా అన్న అబద్ధాలు చెబుతాడు అని ప్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి మర్చిపోయారా ?
• పోయిన ఎన్నికల సమయంలో అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని, జగన్ చెప్పడమే కాకుండా, అప్పుడు పోటి చేసిన ప్రతి నాయకుడి చేత కుడా చెప్పించిన మాట వాస్తవం కాదా..? ఇంతకన్నా అబద్దాలు చెబుతాడు అన్నదానికి వేరే ఉదాహరణ కావాలా ? తర్వాత , అమరావతి వద్దు , మూడు రాజధానులే ముద్దు అని రాష్ట్ర ప్రజలను మోసం చేయడం నిజం కాదా ? సమాధానం చెప్పండి. ఉన్న విషయం చెబితే మీకెందుకు అంతఉలికిపాటో మాకైతే అర్ధం కావడం లేదు.
• మా ఎంపి గారు 2004 నుండి 2009 వరకు, అలాగే 2019 నుండి 2024 వరకు ఎం జరిగిందో అన్నీ తనకు తెలుసనని చెప్పారు. ఎమన్నా అవినీతి జరిగింది అని చెప్పారా అందులో తప్పేముంది ? ఆరెండు కాలాలలో ఆయన గౌరవ ప్రదమైన పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. 2004 నుండి 2009 వరకు తెనాలి ఎంపి గా ఉన్నారు. అప్పటి తెనాలి పార్లమెంట్ నియోజక వర్గం గుంటూరు మరియు కృష్ణా రెండు జిల్లాలలో ఉంది. ఈయన రెండు జిల్లాలకు 2004 లోనే ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి రెండు జిల్లాలలో ఎక్కడైనా పోటి చేయొచ్చు. ఒక ఎంపి గా ప్రభుత్వం లో ఏం జరుగుతుందో తనకు తెలుసునని చెప్పడంలో తప్పేముంది ? అ టర్మ్ లలో ప్రభుత్వం లో జరిగిన మంచి , చెడు రెండూ ఆయనకు తెలుసు. మీరిద్దరూ ( రాంబాబు / పెర్ని నాని ) ఎందుకు భుజాలు తడుము కుంటున్నారు …?
• ఎంపి గారు పారిపోయారు అని అంటున్నావు … ఎంపి గారు ఎక్కడికి ఎప్ప్పుడూ పారిపోలేదు. 2004 లోనే తెనాలి ఎంపి గా గుంటూరు మరియు కృష్ణా జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తీ అయన. అప్పట్లో తెనాలి పార్లమెంట్ స్థానం రద్దు అయింది కాబట్టి పార్టీ అధిష్టానం, పార్టీ అధ్యక్షుడు నిర్ణయం మేరకు ఒక క్రమ శిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా, వారు నరసరావుపేట లో పోటి చేయమంటే అక్కడ, తర్వాత గుంటూరు పోటి చేయమంటే అక్కడ పోటి చేసిన వ్యక్తీ మా ఎంపి గారు… మన రాష్ట్రంలో ఇలాంటి రికార్డు కేవలం పి.వి. నరసింహ రావు గారు మరియు నేదురుమల్లి జనార్ధన రెడ్డి గార్లకు మాత్రమే ఉందన్న విషయం నీకు తెలుసా ? అంతేకాని, మీలాగా చెల్లని వెయ్యి రూపాయల నోటు కాదు మా ఎంపి గారు. పెర్ని నాని నువ్వు బందర్ లో తప్ప ఎక్కడా పోటి చేయలేవు. ఒకవేళ చేసినా కనీసం వార్డు మెంబర్ గా కుడా గెలవలేవు. ఇప్పుడు కుడా బందర్ లో ఎం ఎల్ ఏ గా గెలవనేననే కదా జగన్ గార్ని బ్రతిమిలాడి నీ కొడుక్కి సీట్ ఇప్పించు కున్నావు ? ఓడిపోయినా నీ కొడుక్కి సానుభూతి ఉంటుందన్న దిక్కుమాలిన ఆలోచన నీది.
• నీ లాగా సీటు గురించి బ్రతిమిలాడుకునే మనస్తత్వం మా బాలశౌరి గారిది కాదు . అయన మొదటి నుండి హుందా గానే రాజకీయాలు చేశారు. మీలాగా చెల్లని కాసు కాదు మా ఎంపి గారు. చెల్లె కాసు కాబట్టీ ఎక్కడైనా పోటి చేయగలిగారు. అలాగే అంబటి సంబరాల రాంబాబు రేపల్లె నుండి సత్తెనపల్లి కి పారిపోయి వచ్చాడా ? ఇప్పుడు మీరు మారుస్తున్న సమన్వయ కర్తలు అందరూ పారిపోయిన వాళ్ళేనా ?
• ఢిల్లీ లో జుగుప్సాకరంగా మాట్లాడారు అని ఏవో కారుకూతలు కుశారు. అసలు జుగుప్సాకరం అనే పాదాలకు మీరిద్దరూ ( రాంబాబు , పెర్ని నని ) పేటెంట్ కలిగి ఉన్న వ్యక్తులు. రెండో దఫా మంత్రులను మార్చి, మరొకరికి అవకాశం ఇచ్చినప్పుడు, పెర్ని నాని ఈ జగన్ కోసం పవన్ కళ్యాణ్ ని, చంద్ర బాబు ని తిట్టాను… నా కులంలో అందరికి చెడ్డ వాడిని అయ్యాను. అయినా నాకు మంత్రి పదవి రెండో సారి ఇవ్వకుండా అన్యాయం చేసాడు అని జగన్ ని బూతులు తిడుతూ చేతిలోని సెల్ ఫోన్ ను విసిరి కొట్టి పగల కొట్టుకున్నది వాస్తవం కాదా ?
• మీరిద్దరూ ప్రెస్ వాళ్లతో కూర్చొని, జగన్ ఈ విధంగా మద్యం మరియు ఇసుక దోపిడీ చేస్తుంటే, ఎన్నికలలో ఏ ముఖం పెట్టుకొని వోట్లు అడగాలని , ప్రజలు అడిగితె ఎం సమాధానం చెప్పాలని వాళ్లతో ప్రైవేటు గా అన్నది నిజం కాదా ?
• మీ ఇద్దరికీ రాజకీయాలే వ్రత్తి. దాన్నో సంపాదనా వృత్తిగా మార్చిందే మీరు. రాజకీయం చేసి అడుక్కోవడం, దోచుకోవడం మీ నైజం. కానీ మా ఎంపి గారు వ్యాపారం చేసి సంపాదించిన సొమ్మును రాజకీయాలలో ఖర్చు పెట్టె వ్యక్తీ. మీ బతుక్కి ఎప్పుడైనా ఇన్ కం టాక్స్ కట్టారా ? జనం మీద నోరేసుకుని పడిపోయి డబ్బులు సంపాదించే రకాలు మీరిద్దరూ. గుంటూరు జిల్లలో సంబరాల రాంబాబు, కృష్ణ జిల్లలో పెర్ని పైన వాళ్ళు ఏం కీ ఇస్తే, అది వాగే వ్యక్తులు మీరు. మీకు నిజాయితీ ఉంటె మీ ఆస్తుల మీద ఎంక్వయిరీ కి మీరు సిద్ధమా ?
• ఇంత ఎందుకు ? మా ఎంపి గారి మీద పోటి చేసి గెలిచే దమ్ము, ధైర్యం మీకు ఉన్నాయా ?
• షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదంటూ మీ సోషల్ మీడియా వాళ్ళు పెడుతున్న పోస్టులు చూసి మీరిద్దరూ ఎప్పుడైనా స్పందించారా ? వాళ్ళని ఏమైనా కట్టిడి చేయగలిగారా ? మరీ ఇంత దిగజారిన రాజకీయాలు చేయాలా ?
• ఇరిగేషన్ మంత్రిగా ఉంది, పోలవరం పూర్తీ చేయకుండా, సొల్లు కబుర్లు చెబుతూ, సంక్రాంతికి లాటరీలు పెట్టి డాన్సులు చేసే రాంబాబు కు రెండో పంట కు నీళ్ళు లేక మొక్కజొన్న వేసిన గుంటూరు జిల్లా రైతులు ఎంత కష్టాలు పడుతున్నారో జిల్లా మంత్రిగా నీకు తెలుస్తుందా ? ఇప్పటికైనా మంత్రిగా నీళ్ళు ఇప్పించి రైతులను ఆదుకోండి…అనవసరమైన ప్రగాల్భాలతో కాలాన్ని వృధా చేయకండి. ప్రజలు మీ వేషాలు గమనిస్తున్నారు. సరైన సమయంలో మీకు బుద్ధి చెబుతారు.