అక్టోబర్ 24, 2026
TRINETHRAM NEWS
Blood Donation Camp

పోలీస్ అమరవీరుల 67వ సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని రక్తదాన శిబిరం.

Blood Donation Camp : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 24, త్రినేత్రం న్యూస్. దేవరకొండ సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్ని డీ ఎస్ సి శ్రీనివాసరావు ప్రారంభించి కార్యక్రమానికి సహకరించిన దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ లను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్న రక్త దానం మిన్న అని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాలుపంచుకోవడం చాలా సంతోషకరమని,రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని అన్నారు. మీ రక్తం ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు. రక్తదానం మానవత్వం యొక్క నిజమైన చర్య. మీ శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది అందులో 350 ఎం ఎల్ ఇస్తే ముగ్గురు ప్రాణాలు నిలబెట్టిన వారవుతారు. మనం రక్తదానం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది, రక్తం చిక్కదనం తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది, అలాగే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

రక్తదానం చేసిన 48 గంటల్లోనే కొత్త రక్త కణాలు తయారు చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల శరీరం తాజాగా మారుతుంది ఇతరులకు సాయం చేయడం వల్ల కలిగే సంతోషం మానసిక ఉల్లాసం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. హీరో అవ్వడానికి సినిమాలలోనే నటించనవసరం లేదు, గర్భిణీ స్త్రీలు, అవయవ మార్పిడికి, ప్రమాదం మరియు గాయాల బాధితులకు ,సంక్లిష్ట శాస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వారికి ఎంతో అవసరం. కాబట్టి నిజజీవితంలోనూ రక్తదానం చేసి హీరోలు కావచ్చు ,మీ యొక్క ఒక్క చుక్క రక్తం మరొకరి ప్రాణదాతగా మారుతుంది. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి. మీరు దానం చేసే రక్తం ఎవరికో జీవితంలో మరొక అవకాశాన్ని ఇస్తుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి ఐ వెంకట్ రెడ్డి ,డా : రవి ప్రకాష్ సూపర్డెంట్, అధ్యక్షుడు ఎన్ వీ టి, డా;కృష్ణ ఆర్ ఎం,లైన్స్ అధ్యక్షుడు జంగయ్య, ఎస్ ఐ లు రాజు నారాయణరెడ్డి, లోకేష్ మరియు పోలీస్ సిబ్బంది. ప్రధానకార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, ప్రచార కార్యదర్శి తాళ్ల సురేష్, పులిపాటి సందీప్, కౌన్సిలర్స్ ముత్యాల రవి, సాయి చంద్ర గౌడ్, జానీ, అజయ్ చంద్ర, పందిరి జ్యోతి, వంగూరు వెంకటేశ్వర్లు, నీల బుచ్చయ్య, కాశీనాథ్, సత్యనారాయణ, మల్లయ్య, రఘురాం, శ్రీను, వెంకటేశ్వరరావు, మెడికల్ సిబ్బంది, చారి, రఫీ, కవిత, కీర్తి, అరవింద్, సతీష్, రాజేష్, జనార్ధన్, నందు, నాగరాజు ,సాయి, బలరాం, దినేష్, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page