Trinethram News : Feb 10, 2026, తెలంగాణ : నారాయణ పేట్ జిల్లాలో దారుణం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మంగళవారం తన ఇంట్లో మహదేవ్ ఉరేసుకుని చనిపోయాడు. మహదేవ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రేపు (ఫిబ్రవరి 11న) ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఒక్కరోజు ముందే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

