నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Cultivate Aruthadi

—మండల వ్యవసాయాధికారి:- రెహానా.

Cultivate Aruthadi : డిండి( గుండ్లపల్లి) అక్టోబర్ 26, త్రినేత్రం న్యూస్. డిండి( గుండ్లపల్లి) మండలం, రామంతపూర్ గ్రామంలో కొండలు రెడ్డి పొలాన్ని వ్యవసాయాధికారి సోమవారం సందర్శించడం జరిగింది. ఆయన పొలంలో సాగుచేస్తున్న మినుములు , పెసర్లు ఉలవలు వంటి పప్పుధాన్య పంటలను పరిశీలించారు. తక్కువ నీటి వినియోగంతో, తక్కువ పెట్టుబడితో పప్పుధాన్యాల పంటలను సాగు చేయడం పట్ల రైతు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా రైతులతో మాట్లాడుతూ….

యాసంగిలో వరి పంట సాగు చేయకుండా, దానికి బదులుగా ఆరుతడి పంటలైన శనగలు, మినుములు, పెసర్లు, జొన్నలు, వేరుశనగ వంటి పంటలను సాగు చేసుకోవాలి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, భూగర్భ జలమట్టాలు తగ్గిపోతున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి”. ప్రస్తుతం బోర్లలో నీరు ఉన్నప్పటికీ, వరి సాగు చేసిన తర్వాత బోర్లు ఎండిపోయి పంటకు నీరు అందించలేని పరిస్థితి ఏర్పడితే రైతులు పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయ్యే ప్రమాదం ఉంది .

కాబట్టి రైతులు భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, యాసంగిలో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు దానికి బదులుగా ఆరుతడి పంటలైన శనగలు, మినుములు, పెసర్లు, జొన్నలు, వేరుశెనగ వంటి పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page