త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 1: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం.. బోగోలు మండలం: ముంగమూరు భవాని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణకేంద్రం డైరక్టర్ డాక్టర్ కట్టిపల్లి సింహాద్రి రావు కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 1 ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో 3 దశాబ్దాల కాలంగా ఎయిడ్స్ రోగులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను జిల్లా వైధ్యశాఖాదికారి డాక్టర్ సుజాత మరియు జిల్లా ఎయిడ్స్ నోడలు అధికారి డాక్టర్ యస్ కె ఖాదర్ వళి గార్ల చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా సింహాద్రి రావు మాట్లాడుతూ అవార్డు లు బాధ్యత పెంచుతాయని గత 30 సంవత్సరాలు గా రాష్ట్రంలో మెదటి సారిగా ఆదరణకేంద్రం ప్రారంభించి తద్వారా స్వచ్ఛందంగా సేవలు అందించానని దాతల సాయంతో ఇంకా ఎక్కువమంది కి ఆదరణ కల్పించడమే ధ్వేయంగా పని చేస్తానని తెలిపారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


