TRINETHRAM NEWS

New Year: న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం.. ఈ తప్పులు చేశారో జాగ్రత్త..

న్యూ ఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్ చెప్పడం తప్పు కాదు. కానీ జోష్‌ పేరిట ఎగస్ట్రాలేస్తే ముప్పు తప్పుదు. లైఫ్‌కు రిస్క్‌ తప్పదు. నిబంధనలు ఉల్లంఘించినా, చట్టాన్ని అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవనేది పోలీసుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌, వైజాగ్‌, విజవాయడలో న్యూ ఇయర్‌ సంబరాలపై పోలీసులు నిఘా పెంచారు…

ప్రపంచమంతా న్యూఇయర్ జోష్‌లోకి వెళ్లిపోయింది. న్యూఇయర్ అంటే తెలుసుకదా.. విందులు, చిందులు.. డీజే మోతలు.. జిగేల్ మనే లైట్లు.. కేక్ కట్ చేస్తూ సంబరాలు.. బాణసంచా కాల్చుతూ సందడి. తగ్గేదే లే.. అనే రేంజ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుతుంటారు. పార్టీలు, పబ్‌లు.. ఈవెంట్ల పేరుతో రచ్చ రచ్చ చేస్తుంటారు యువత. అయితే కండీషన్స్ అప్లై అంటున్నారు పోలీసులు.

న్యూ ఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్ చెప్పడం తప్పు కాదు. కానీ జోష్‌ పేరిట ఎగస్ట్రాలేస్తే ముప్పు తప్పుదు. లైఫ్‌కు రిస్క్‌ తప్పదు. నిబంధనలు ఉల్లంఘించినా, చట్టాన్ని అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవనేది పోలీసుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌, వైజాగ్‌, విజవాయడలో న్యూ ఇయర్‌ సంబరాలపై పోలీసులు నిఘా పెంచారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తే ఇక అత్తారింటికే దారి అంటున్నారు.

న్యూఇయర్‌ వేడుకలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక నిఘా పెడుతున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశారు. డ్రంక్ అండ్‌ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు. రోడ్లపై కేకులు కట్‌ చేయడానికి అనుమతి లేదు. మద్యం షాపులకు రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట వరకే వేడుకలకు అనుమతి ఇచ్చారు. ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్‌రోడ్డుపై 10 గంటల నుంచే ఆంక్షలు అమలు కానున్నాయి.

ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ రాత్రి 10 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలకు ప్రవేశం ఉండదు. శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే పాసులు ఉన్న వాహనాలను మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతిస్తారు. క్యాబ్, ఆటో డ్రైవర్స్ యూనిఫామ్ ధరించడమే కాకుండా తమ డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని సూచించారు. పబ్, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామనీ.. మద్యం సేవించిన కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనేది పోలీసుల మరో కండీషన్.

సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే రైడ్స్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి 8 గంటల నుంచి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక డ్రగ్స్ తీసుకునేవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది పోలీసు యంత్రాంగం. బ్రీత్‌ ఎనలైజర్స్‌ మాత్రమే కాదు డ్రంక్‌ అండ్‌ డ్రైవర్స్‌కు చెక్‌ పెట్టేలా గతంలో ఎన్నడూ లేని విధంగా హై ఎండ్‌ ఎక్విప్‌మెంట్‌ను వాడుతున్నారు హైదరాబాద్‌ పోలీసులు.

ఇదిలా ఉంటే.. విశాఖలోనూ న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల అప్రమత్తమయ్యారు. ఆర్కే బీచ్‌రోడ్‌‌లో రాత్రి నుంచి వాహనాలకు నో ఎంట్రీ.. రాత్రి తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై వాహనాల నిషేధం అమలులో ఉంటుంది. హైస్పీడ్, జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవనీ.. అర్ధరాత్రి ఒంటిగంటలోపే వేడుకలు ముగించాలంటున్నారు పోలీసులు. అటు విజయవాడ నుంచి కూడా పోలీసులది సేమ్‌ సందేశం. సంబరాల పేరిట చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సీపీ క్రాంతి రానా టాటా. రోడ్లపై కేక్‌ కట్ చెయ్యటానికి అనుమతులు లేవన్నారు. సిటీలో సెక్షన్ 30 అమలులో ఉందన్నారు. 5 మంది కంటే ఎక్కువ గుమికూడవద్దన్నారు. MG రోడ్డు, బందర్ రోడ్, ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. న్యూయార్ రోజు రోడ్లపైకి వచ్చి రచ్చ చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు.