వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకు 42 శాతం రాజకీయ మరియు ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించినందుకు బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు A. రేవంత్ రెడ్డి మాట నెరవేర్చుకున్నారని బీసీల హృదయాల్లో చిరస్థాయిగా వారి స్థానం ఉంటుందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఘన విజయం అందించాలని 32 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లనీ 23 శాతానికి తగ్గించి బీసీల నడ్డి విరిచిన టిఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కలని, బిజెపి పార్టీ బీసీ లను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూసి కేంద్రంలో గద్దెనెక్కి బీసీలపై కపట ప్రేమ చూపిస్తుందని దమ్ముంటే దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 42 శాతం బీసీ బిల్లు అమల్లో మన వికారాబాద్ శాసనసభ్యులు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ హయాంలో బిల్లు పాస్ కావడం మరింత సంతోషాన్ని కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


