TRINETHRAM NEWS

బీసీ జేఏసీ కన్వీనర్ గా నియమితులైన నాగేశ్వరరావు యాదవ్ ను సన్మానించి అభినందనలు తెలిపిన బీసీ నేత లింగంగౌడ్

Trinethram News : Telangana : బీసీ కులాల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ బీసీ జేఏసీ కన్వీనర్ గా నియమితులైన గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్ ను సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ బీసీ కులాలన్నీ ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల అప్పుడు బీసీలకు టికెట్ల కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నాయని అందుకే మనం ఎన్నికలప్పుడు పార్టీలకతీతంగా ఐక్యమత్యంగా ఉండి మన ఓటు మన బీసీలకే వేసుకొని మన సత్తా చాటాలన్నారు. అప్పుడే ఈ అగ్రవర్ణ పార్టీలు మన బీసీలను చూసి భయపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు ఎర్రబెల్లి దుర్గయ్య భూపతి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App