
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం రోజున నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలోని ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాహెబ్ విగ్రహాలకు రమేష్, స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ యువత అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలని ఈ సందర్భంగా రమేష్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
