
Trinethram News : రాజానగరం: విద్యతోనే ఏ సమస్యనైనా అధిగమించగలమని దృఢ సంకల్పంతో భారతదేశ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ తెలిపారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ సెమినార్ హాలులో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విసి ప్రసన్న శ్రీ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన జగ్జీవన్ రామ్ భారతీయ స్వాతంత్ర్య కార్యకర్తగా, స్వాతంత్ర అనంతరం సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేశారన్నారు.
విద్యతోనే ఆయన ఉన్నత పదవులను అధిరోహించి వాటికి వన్నె తీసుకువచ్చారని తెలిపారు. 30 సంవత్సరాలు వివిధ రంగాలలో మంత్రిగా కొనసాగిన ఆయన కాలంలో ఆధునిక దేవాలయాలుగా పిలవబడే నాగార్జునసాగర్ వంటి డ్యామ్ నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. బాబూజీగా ప్రసిద్ధి కెక్కిన బాబు జగజ్జివన్ రామ్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఉన్నత విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు మహనీయుల జీవిత చరిత్రలను విద్యార్థులకు బోధిస్తుండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
