
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 5 త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిండి. ఎస్ఐ రాజు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమర యోధులు,సంఘసంస్కర్త,రాజకీయ వేత్త, అంతరనివారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ను స్థాపించడంలో కీలక పాత్ర .
కుల వివక్షకు ,సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాతంచేసిన వీరుడు , సంక్షేమం సమానత్వం సమాజంకోసం చేసిన కృషికి నిదర్శనంగా వారి పుట్టినరోజును సమతా దివాస్ గా జరుపుకుంటాం.
వలస వాదం సామ్రాజ్య వాదాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉధ్యమంలో ప్రముఖ పాత్ర పోషించి దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు ,33,సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ,దేశ ఉపప్రధానిగా, ఉత్తమ పార్లమెంటెరియన్ గా అరుదైన గౌరవం జగ్జీవన్ రామ్ సొంతం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేసిన దళిత ఐకాన్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆమహనీయునికి నివాళులు అర్పిస్తూ ,,,,, మహనీయుని బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బోల్లె శైలేష్, బిజెపి నియోజకవర్గ కన్వీనర్. ఏ టి కృష్ణ, బాధమోని శ్రీనివాస్ గౌడ్, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీద సాయి కుమార్, మాజీ ఉపసర్పంచ్ పొలం లక్ష్మణ్, ఎం ఏ,కలిం,సాలయ్య, ప్రవీణ్ రెడ్డి, చింటూ, అనీష్, ప్రవీణ్, మల్లేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
