
తేదీ : 05/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏరియా వైద్యశాల సూపర్డెంట్ ఇందిర దేవి , టిడిపి నాయకులు వెలిగండ్ల. రామకృష్ణ పెద్దలు పూలమాలతో నివాళులర్పించారు.
అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జగ్జీవన్ రామ్ నా జీవితాన్ని అంకితం చేశారని, అత్యున్నత పదవులకే అన్ని తెచ్చిన ఘనత ఆయనదే అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు దేశం ఎప్పటికీ మరువదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ జోన్స్ దయానందం, సభ్యులు మజ్జి. శ్రీనివాసరావు, సిహెచ్. దేవేంద్రుడు, మారీదు. కరుణ, నాగరాజు, ఆర్ ఎం ఓ కృష్ణ దొర మరియు వైద్యశాల వైద్యులు , సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
