బాల్యవివాహల పై అవగాహనా.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
బాల వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లొ అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి.డి బి షీతల్ ఈ కార్యక్రమంలొ న్యాయసేవ సెక్రటరీ మాట్లాడుతూ బాల్యవివాహ నిర్మూలనకు చేయవలసిన విధివిధానాలను గురించి, బాల్య వివాహాలు జరిపించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉండాలి బాల్య వివాహాలు జరుగుతుంటే మనకు ఏమాత్రము పట్టనట్లు ప్రేక్షక పాత్ర వహించకుండా మన వంతు ప్రయత్నం చేయాలి, పోలీసులకి పిర్యాదు చెయ్యడం లాంటివి లేదా వివాహము చేసేందుకు ప్రయత్నిస్తున్నవారికి సరైన అవగాహన కల్పించాలి బాల్యవివాహాలు జరిపించిన తర్వాత ఆ దంపతులకు కలిగే అనర్థ లు వాటివల్ల కలిగే నష్టాల గురించి తెలియని వారికి వివరించాలని తెలిపారు
బాల్యవివాహాలు మన పరిధిలోనే కాకుండా ఇతర ప్రదేశాలలోకి వెళ్లి వివాహాలు జరిపించిన అక్కడ కూడా వెళ్ళి బాల్యవివాహాలను ఆపి వారి తల్లిదండ్రులకు మరియు బంధుమిత్రులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సమాచారము ఇచ్చి వారికి సహకరించాలి అన్నారు . బాల్యవివాహాల నిర్మూలనలో అందరు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బాల్యవివాహాల నిర్మూలనకు పాటుపడతామని విద్యార్థుల చేత మరియు అధ్యాపకుల చేత అక్కడికి విచ్చేసిన ప్రజల చేత పీతిజ్ఞ చేయించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App