Awareness of students on cannabis and drugs
చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు గోదావరిఖని ఏసీపీ రమేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రతి నెల మూడవ బుధవారం ANTI NARCOTIC AWARENESS DAY కార్యక్రమం లో భాగంగా ఈరోజు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ జూనియర్ కాలేజీ లో గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం, వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోదావరిఖని ఏసిపి ఏం రమేష్ ముఖ్యఅతిథిగా హాజరవడం జరిగింది.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గంజాయి తదితర మాదగద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని ఏసీపీ అన్నారు. విద్యార్థులు గంజాయి మాదక ద్రవ్యాలకు, సిగరెట్, గుట్కా, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కావొద్దు అని వాటికి ఆకర్షితులు అయి జీవితాలు నాశనం చేసుకోవొద్దు అని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులు చదువు పై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితం లో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా తమ తల్లీ తండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని తెలియచేసారు.
కాలనీ, గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మినా, పీల్చిన తమ దృష్టికి తేవాలని, గంజాయి మహమ్మారి నిర్మూలనలో అందరు తమ వంతుగా కృషిచేయాలని కోరారు అవగాహనా కార్యక్రమంలో 400 మంది కళాశాల విద్యార్థులు, కళాశాల లెక్చరర్స్ పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఏసీపీ గోదావరిఖని M రమేష్ A. ఇంద్రసేనారెడ్డి ఇన్స్పెక్టర్ గోదావరిఖని వన్ టౌన్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App