TRINETHRAM NEWS

Aurobindo Pharma donates five crores to the Chief Minister’s Relief Fund for flood victims

Trinethram News : Telangana : Sep 5, 2024

వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క లను సంస్థ ప్రతినిధులు కలిసి, విరాళం చెక్కును అందజేశారు.

సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసినవారిలో అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డి , డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ఆర్ రావు ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో అరబిందో ఫార్మా సంస్థ చూపిన ఔదార్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Aurobindo Pharma donates five crores to the Chief Minister's Relief Fund for flood victims