TRINETHRAM NEWS

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మోర్ సెంటర్ ఎదురుగా గల మహాలక్ష్మి మొబైల్ షాప్ నందు నరసరావుపేట బీసీ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి తన మొబైల్ రిపేర్ కి ఇచ్చాడు. రిపేర్ అనంతరం మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని దగ్గర డబ్బులు ఇస్తానని మొబైల్ తీసుకువెళ్లాడు. చందు అనే వ్యక్తికి మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని సయ్యద్ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు చందు అనే వ్యక్తి తన అనుచరులను వెంట తీసుకొని వచ్చి మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని సయ్యద్ పై చందు తన అనుచరులు మూకుమ్మడిగా దాడి చేశారు.

దాడిలో గాయపడిన సయ్యద్ను స్థానికులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై నరసరావుపేట ప్రాంతంలో ఉన్న మొబైల్ షాప్ ల యజమానులు అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేరు డబ్బులు అడిగితేనే దాడి చేస్తున్నారని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించకపోతే ఎలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని తక్షణమే పోలీస్ అధికారులు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని మొబైల్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.