అల్లూరి జిల్లా పరిధిలో కాఫీతయారీ ఇండస్ట్రీ ఏర్పాటు చెయ్యాలి,అరకునియోజకవర్గ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం.
ఆంధ్రప్రదేశ్: అల్లూరి జిల్లా అరకు నియోజవర్గ (అరకువేలి మండలం) త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 27:
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో కాఫీ తయారీ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి జిల్లాలో గిరిజన యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చెయ్యాలని జిల్లా స్థాయి దిశా సమీక్ష సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అరకు నియోజకవర్గం శాసన సభ్యులు, రేగం మత్స్యలింగం.
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో పండే ఆర్గానిక్ కాఫీ అరకు కాఫీకు అంతర్జాతీయంగా మంచి బ్రాండ్ ఉందని అలాంటి అరకు కాఫీ తయారీ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే గిరిజన ప్రాంతంలో యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని వివరించారు. మరియు అరకు నియోజకవర్గం పరిధిలో గల సమస్యలను సుధీర్ఘంగా అధికారులను వివరించారు. అరకు నియోజకవర్గంలో రోడ్లు, మంచి నీరు సమస్యలను గుర్తించడని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.ఈ సమావేశంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనూజ రాణి , పాడేరు నియోజకవర్గం శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ శర్మ , మరియు కేంద్రం ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App