
కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీల పెంపును ఖండిస్తూ అరకు లోయ మెయిన్ రోడ్డుపై భారీ ర్యాలీ నిర్వహించిన అరకు ఎమ్మెల్యే.
అల్లూరి జిల్లా అరకులోయ టౌను త్రినేత్రం న్యూస్ డిసెంబర్.28:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పిలుపు మేరకు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై కరెంట్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్ సీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకులు , ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి గ్రీన్ వేలి జంక్షన్ నుండి అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీరింగ్, కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, సమాధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పుహామీలతో గద్దెనెక్కి కరెంటు చార్జీల పెంపుతో ప్రజలకు చుక్కలు చూపుతున్న ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన రూ,15,485.36 కోట్ల చార్జీల బాదుడును వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామి ఇచ్చిన విధంగా చార్జీల పెంపును నిలిపేయాలని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని, కూటమి ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నామని రేగం మత్స్యలింగం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి సభ్యులు కుంభ రవిబాబు,విశాఖపట్నం జిల్లా ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర , జెడ్పీటీసీలు శెట్టి రోషిణీ , చట్టారి జానకమ్మ, ఎంపీపీలు బాక ఈశ్వరి, శెట్టి నీలవేణి, రంజపల్లి ఉష రాణి , ఎంపీటీసీలు, సర్పంచులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
