29 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ టీమ్‌లోని బాసిస్ట్ మోహిని సైతం భర్త మార్క్‌తో విడిపోతున్నట్లు ప్రకటన
Trinethram News : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.
- ఏఆర్ రెహమాన్ టీమ్‌లోని బాసిస్ట్ మోహిని దే సైతం భర్త మార్క్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
— ఏఆర్ రెహబాన్ దంపతులు విడిపోయిన విడిపోతున్నట్లుగా ప్రకటించిన కొద్దిగంటల్లోనే మోహిని సైతం డివోర్స్‌పై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మోహిని, మార్క్ సంయుక్త ప్రకటనలో పరస్పర అవగాహన ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. అయినా ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటామని.. జీవితంలో భిన్నమైన విషయాలను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ముందుకు సాగేందుకు పరస్పర అంగీకారంతో విడిపోవడమే ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
–మోహిని కోల్‌కతా నివాసి కాగా.. ఆమె బాస్ ప్లేయర్. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా షోల్లో ఏఆర్ రెహమాన్‌తో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు.
— ఏఆర్ రెహమాన్ 1995లో సైరా భానును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు పెళ్లయ్యింది.
— వైవాహిక బంధంలో ఏర్పడిన భావోద్వేగ క్షణం తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఏఆర్ రెహమాన్ న్యాయవాది తెలిపారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నా.. ఉద్రిక్తలు, ఆందోళనలు వారి మధ్య గ్యాప్‌ను పెంచాయని.. ఆ అగాధాన్ని పూడ్చేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App