
Trinethram News : ఏపీలో దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. విశాఖలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని చెప్పారు. త్వరలోనే భారీ పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
