కుడా ప్రమాణ స్వీకార మహోత్సవంలో కుప్పకూలిన వేదిక
Trinethram News : కాకినాడ జిల్లా : డిసెంబర్ 15
కాకినాడలో కుడా చైర్మన్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ఘటనలో మాజీ మంత్రి చినరాజప్పకు స్వల్ప గాయాలయ్యాయి. స్టేజ్ కూలిన సమయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే చినరాజప్ప, పంతం నానాజీతో పాటు పలు వురు నేతలు వేదికపైనే ఉన్నారు.
వీరిలో చిన రాజప్పకు స్వల్ప గాయాలయ్యాయి. యనమల రామకృష్ణుడు, పంతం నానాజీ ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రమాణస్వీకారోత్సవం కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి పరిమితికి మించి నాయకులు ఎక్కడం వల్లే ఈ ఘటన చోటుచేసు కుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
ప్రమాణస్వీకారం చేయక ముందే ఈ ఘటన జరిగింది. దీంతో రామ స్వామి ప్రమాణస్వీకారం కోసం మరో తేదీని ప్రకటిం చనున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App