Trinethram News : Mar 12, 2026, తెలంగాణ ; హైదరాబాద్ కోకాపేటలో అల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయికి ఎదగాలని, హాలీవుడ్‌ను సైతం ఆకర్షించేలా రాణించాలని సీఎం ఆకాంక్షించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికే జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందని, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై నిలవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


