All set for Duleep Trophy Cricket Tournament
నేటి నుంచి ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో మ్యాచ్‌లు ప్రారంభం
ఏర్పాట్లను పరిశీలించిన ఏసీఏ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ జిల్లా అధికారులు
Trinethram News : అనంతపురం:
దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధం చేశారు. గురువారం నుంచి మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం సహకారం తో బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అనంతపురం జిల్లా క్రికెటర్ అసోసియేషన్ మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతపురంలో ఐదు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఏసీఏ త్రీమెన్ కమిటీ మెంబర్ మాంచో ఫెర్రర్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, మీడియా కో ఆర్డినేటర్ పి.తిమ్మప్ప, దులీప్ ట్రోఫీ ఆర్గనైజింగ్ కమిటీ షాబుద్దీన్, ఏడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకాష్‌రెడ్డి, కె.మధు ఆచారి, ఏసీఏ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ రోహిత్ వర్మ తదితరులు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. క్రికెట్ చూసేందుకు వచ్చే అభిమానుల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లో స్నాక్స్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ప్రత్యక్ష ప్రసారం..
దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను స్పోర్ట్స్ 18, జియో ఛానల్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
వీటికి అనుమతిలేదు..
స్టేడియంలోకి లాప్‌టాప్స్, కెమెరాలు, అగ్గి పెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాటరీలు, బ్యాగులు, బ్యానర్లు, సిగరెట్టు, లైటర్లు, హెల్మెట్లు, నీళ్ల బాటిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, షార్ప్ మెటల్స్ తదితర వస్తువులను అనుమతి లేదు.
మ్యాచ్ షెడ్యూల్..
5 నుండి 8వ తేదీ వరకు టీమ్ సి టీమ్ డి (ఆర్డీటీ స్టేడియం ‘ఏ‘)
12 నుండి 15 వరకు టీమ్ ఏ టీమ్ డి (ఆర్డీటీ స్టేడియం ‘ఏ‘)
12 నుండి 15 వరకు టీమ్ బి టీమ్ సి (ఆర్డీటీ స్టేడియం ‘బి‘ గ్రౌండ్)
19 నుండి 22 వరకు టీమ్ ఏ టీమ్ సి ( ఆర్డీటీ స్టేడియం ‘ఏ‘)
19 నుండి 22 వరకు టీమ్ బి టీమ్ డి (ఆర్డీటీ స్టేడియం ‘బి‘ గ్రౌండ్)
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App