
All people should live happily with the grace of Mallikarjuna Swami: MLA KP Vivekanand
Trinethram News : ఈరోజు 126 – జగద్గిరి గుట్ట పొలాల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సంధర్బంగా ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయన్నారు. మల్లికార్జున స్వామి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, మహిళా అధ్యక్షురాలు ఇందిరాగౌడ్, సీనియర్ నాయకులు పాపులు గౌడ్, పాపిరెడ్డి, వెంకటేష్, మెట్ల శ్రీను, బ్రహ్మానంద చారి, ఆలయ కమిటీ అధ్యక్షులు సుజిత్ కుమార్ జెనా, ఉపాధ్యక్షులు ఈ. రాజేష్, కార్యదర్శి బండి రాములు, సలహాదారులు సత్యనారాయణ, ఉప్పల సుధాకర్, ఈ. రాములు, రామానంత్ సావాని, సంయుక్త కార్యదర్శి బత్తుల భాస్కర్, కోశాధికారి దినేష్ సావాని, సభ్యులు కిషన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
