TRINETHRAM NEWS

All facilities should be provided in the mine cemetery

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ గ్యాస్ దహన సంస్కారాలు యంత్రం ప్రారంభించాలి

ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేసి రోడ్లు, విద్యుత్ దీపాలు నల్లాలు, రెండ్ బోర్లు, చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలి

డి హెచ్ పి ఎస్ నాయకులు డిమాండ్

గోదావరిఖనిలోని గోదావరి నది ఒడ్డునున్న హిందూ స్మశాన వాటికలో సకల సౌకర్యాలు కల్పించాలని డిహెచ్పిఎస్ నాయకులు కందుకూరి రాజారత్నం మద్దెల దినేష్, ఎర్రల రాజయ్య తొడుపునూరి రమేష్ కుమార్, గంగరపు ప్రసాద్ లు డిమాండ్ చేశారు మంగళవారం రోజున హిందూ స్మశాన వాటికలో డిహెచ్బీఎస్ దళిత హక్కుల పోరాట సమితి బృందం స్మశాన వాటికను సందర్శించారు.
అనంతరం మద్దెల దినేష్ రాజ రత్నం మాట్లాడుతూ దురదృష్టశాత్తు వల్ల ఎవరైనా మృత్యవత పడితే హిందూ స్మశాన వాటికలో దహన నమస్కారాలు చేయాలంటే, వ్యాపారంగా మారిందని ఆర్థికంగా చాలా ఇబ్బందులు మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

స్మశానవాటికలో పూర్తిగా సౌకర్యాలు కరువు అయ్యాయని కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకుండా ఉండడం బాధాకరమని, విద్యుత్ దీపాలు వెలిగే పరిస్థితి లేదని అదేవిధంగా విద్యుత్ & గ్యాస్ దహన సంస్కారాల యంత్రం దాదాపు 15 ఏళ్ల కింద నగరపాలక సంస్థ తరఫున 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసి నేడు అది తుప్పు పట్టి శిధిలావస్థకు చేరుతుందని దాని కొరకు 60 లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద షెడ్డు నిర్మాణం చేయడం జరిగిందని, దాదాపుకోటి రూపాయల ప్రజాధనం వృధాగా అవుతుందని కావున అట్టి యంత్రాన్ని పనిచేసే విధంగా చూడాలని సంబంధించిన అధికారులను వారు డిమాండ్ చేశారు.


అదేవిధంగా స్మశాన వాటికలో ఒక ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని, స్నానాలకు చేయనీకి సింగరేణి మున్సిపల్ ఆధ్వర్యంలో ఒక శాశ్వతత రెండు బోర్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కొన్ని ప్రదేశాలలో నల్లాలు ఏర్పాటు చేయాలని రోడ్లు మొత్తం ధ్వంసం అయ్యాయని చెత్తాచెదారంతో స్మశానం నిండిపోయిందని, స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి స్మశానం మొత్తం క్లీన్ చేసి గ్రీనరీగా మార్చాలని అధికారులను కోరారు.
అదేవిధంగా పాత పద్ధతిలోనే దహన సంస్కారాలను ఉచితంగా చేయాలని
స్మశానన్ని పార్కు లాగా తీర్చిదిద్దాలని చుట్టూ కాంపౌండ్ వాల్ పూర్తిగా కూలిపోయిందని వాటిని చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
స్మశానం అభివృద్ధి కొరకు సింగరేణి, మున్సిపల్ కార్పొరేషన్, ఎన్టిపిసి సంస్థలు అభివృద్ధి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి పక్షాన సంబంధించిన అధికారులను శాసనసభ్యులను కోరారు.
స్మశానం పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తే స్మశానం ముందు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళనలు తప్పవని వారు హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

All facilities should be provided in the mine cemetery