All 17,514 working in National Health Mission across Telangana state should be regularized immediately
510 జి.ఓ.లో నష్టం జరిగిన 4000 వేల ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వనీ కోరుతున్న జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న 17,514 అందర్నీ తక్షణమే రెగ్యులర్ చేయాలి
డిమాండ్లు:
- తెలంగాణ రాష్ట్రంలో వివిద శాఖలో ఏ విదంగా అయితే ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనము చెల్లిస్తున్నారో అదే విదంగా NHM లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
- NHM లో 2018 నుండి 2024 వరకు అన్ని క్యాడర్ ఉద్యోగులందరికి 510 జి.ఓ. ప్రకారం జీతాలు విడుదల చేయ్యాలి.
- NHM లో పనిచేస్తున్న ఉద్యోగులు అన్ని అర్హతలు కలిగి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
- NHM లో పనిచేస్తున్న ఉద్యోగులకు 30% వెయిటేజ్ మరియు కోవిడ్-19 లో పనిచేసిన ఉద్యోగులకు 20% ఆదనపు వేయిటెజ్ ఇస్తూ ఉద్యోగులను భర్తీ చేయాలి.
- NHM లో పనిచేస్తున్న ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ చేసి వేతనాలు పెంచాలి.
- గతంలో నాటి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ 04-08-2021 నాడు జి.ఓ. 177 లో ఉన్న అన్ని పోస్టులను, NHM లో పనిచేస్తున్న అన్ని పోస్టులను షాంక్షన్ చేస్తూ రేగ్యులర్ చేయాలి.
- NHM మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.
- NHM ఉద్యోగి వీది నిర్వహణలో మరణిస్తే వారి ఇంట్లో ఒకరికి 6 నెలల లోపు కారుణ్య నియమకం చేయాలి.
- NHM పథకంలో సంవత్సరానికి 35 సాధారణ సెలవులు ఉద్యోగులందరికి మంజూరు చేయాలి.
- పెండింగ్లో ఉన్న పి.ఆర్.సి. 7 నెలల ఎరియర్స్ మరియు బకాయిలు వెంటనే చెల్లించాలి.
- హర్యాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ మరియు మణిపూర్ ఆయా రాష్ట్రాలలో NHM ఉద్యోగులందరిని రేగ్యులరైజెషన్ చేశారు. కావున తెలంగాణ రాష్ట్రం కూడ NHM ఉద్యోగులందరిని రేగ్యులరైజెషన్ చేయాలని కోరుచున్నాము.
- తెలంగాణ రాష్ట్రంలోని అందరి ఉద్యోగుల ఆరోగ్యానికి మేము రక్షణ అని సేవలందిస్తున్న మా జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్, ఆరోగ్య భీమా ఇవ్వాలి