Alert.. Heavy rains in these areas
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రేపటికి తుఫాన్‌గా బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుఫాన్‌కు రెమాల్ తుఫాన్‌గా నామకరణం చేసింది.
శనివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్న రెమాల్.. ఆదివారం బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తుఫాన్ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్‌పై తుఫాన్ ఎఫెక్ట్ చూపించనుంది.
తీరందాటే సమయంలో భారీ వర్షాలతోపాటు గంటకు 102 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతూ బలపడుతోందని.. 25 ఉదయం తుఫానుగా మారబోతోందని తెలిపారు.
ఉత్తర దిశగా ప్రయాణిస్తు 26నాటికీ తీవ్ర తుఫానుగా మారి.. 26 అర్ధరాత్రి నాటికి బంగ్లాదేశ్ – వెస్ట్ బెంగాల్ మధ్య తీవ్ర తుఫాను తీరం దాటుతుందన్నారు. ఏపీ కోస్తా తీరానికి తుఫాను ప్రభావం ఉండదని స్పష్టంచేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App