ఏఎన్ఎం పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఏఐటీయూసీ వినతి
త్రినేత్రం న్యూస్ హనుమకొండ ప్రతినిధి
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో వెల్లడించిన పోస్టులకు అదనంగా పోస్టులను పెంచడం ద్వారా వైద్య ఆరోగ్యశాఖలో గత 18 సంవత్సరాలుగా పనిచేయుచున్న రెండవ లకు న్యాయం చేయడం అవుతుందని ఎక్కువ మందికి రెండవ లకు ఉద్యోగం అవకాశం వస్తుందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించి ఎక్కువ పోస్టులను మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర సెకండియర్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో నేడు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ మంత్రికి వివరిస్తూ దాదాపు 5000 మంది రెండవలు రాష్ట్రంలో గత 18 సంవత్సరాలుగా తమ సేవలను ప్రభుత్వానికి ప్రజలకు అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఎక్కువ పోస్టులను పెంచడం ద్వారా వీరికి అర్హత పరీక్షలో ఉద్యోగం చేయ అవకాశం ఏర్పడుతుందని వారు తెలియజేశారు, గ్రామీణ స్థాయిలో పేదలకు ఆరోగ్య సేవలు అందించి కారణాల లాంటి కష్ట సమయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు.
వయోపరిమితి వలన పరీక్షకు అర్హత లేని వారికి గతంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ప్రకారం వీరికి 100% గ్యాస్ శాలరీ ఇవ్వాలని, 10 లక్షల రిటర్మెంట్ బెనిఫిట్, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ లను అమలు చేయాలని వారు కోరారు.
అనేక సంవత్సరాల తర్వాత ఎన్నో ఆశలతో రెండవ ఏఎన్ఎంలు ఈ పరీక్షలను రాయడం జరిగిందని వారందరికీ ఉద్యోగం వచ్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించి న్యాయం చేయాలని వారి సందర్భంగా కోరారు.
మంత్రిగారు స్పందిస్తూ వీలైనాన్ని ఎక్కువ పోస్టులను విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని అధికారులతో రిపోర్టు తెప్పించుకొని ఖాళీ పోస్టులన్నింటిని నియమిస్తామని వారు యూనియన్ ప్రతినిధులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎంల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షురాలు జే పద్మ, ప్రధాన కార్యదర్శి శ్యామల, సహాయ కార్యదర్శి తన్వీర్ సుల్తానా, సువర్ణ, సుమిత్ర, భాగ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App