జూలై 7, 2026

WhatsApp Image 2023 12 11 at 2.03.52 PM

TRINETHRAM NEWS

Trinethram News : వరంగల్ జిల్లా…

దివి:- 11-12-2023 ఐనవోలు మండలం…

వర్ధన్నపేట శాసనసభ్యునిగా అసెంబ్లీలో KR నాగరాజు ప్రమాణస్వీకారం చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు. అనంతరం వారు మల్లికార్జున స్వామి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వామివారి శేష వస్త్రాలను మరియు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది. అనంతరం తల్లి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – రాజేశ్వరరావు, మాజీ ఎం.పి సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్రావు, వెంకట నరసయ్య రెడ్డి, ఐనవోలు మండల అధ్యక్షుడు సమోట మహేష్ గౌడ్ తో పాటు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు….

You cannot copy content of this page