
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 8 : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం మడగడ పంచాయితీ పీవీటీజీ లు నిర్మించుకున్న జాకారవలస గ్రామానికి ప్రభుత్వం గుర్తించాలని రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ అరకువేలి మండలం మడగడ పంచాయితీ పరిధిలో కుసుమగుడ గ్రామం నుండి జీవనం కోసం 2001 లో 12 కుటుంబాలు వారి వ్యవసాయ భూములున్నా ప్రాంతంలో జాకరవలస గ్రామం పీవీటీజీలు నిర్మించుకని జీవనం సాగిస్తున్నారని జాకారవలస పీవీటీజీ గ్రామానికి ప్రభుత్వం రెవెన్యూ అధికారులు ఆ గ్రామానికి గుర్తుంపుఇవ్వాలని పకనగూడ లేదా మెచ్చగూడ నుండి రోడ్డు సౌకర్యం కల్పించాలని రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ స్త్రీలను డోలీమోతలతో ఆసుపత్రికి తరిలిస్తున్నారని పిఎం జన్ మన్ హౌసింగ్ ఇల్లులు నిర్మాణం కోసం సిమ్మెంటు ,ఇసుక , రాడ్లు ఇతర నిర్మాణ సామగ్రి తీసుకువెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పీవీటీజీలు నిర్మించుకున్నా జాకారవలస గ్రామానికి ప్రభుత్వం గుర్తింపునిచ్చి రోడ్డు నిర్మాణం చేపటాలని కోరారు.
ఈ కార్యక్రమలో పివిటీజీ జాకారవలస గ్రామస్థులు వంతల బంగార్రాజు, వంతల ఆనందరావు, కిల్లో మల్లేష్ ,కిల్లో అనుషు, మర్రి షాణ, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
