పెద్దపల్లి, జూన్ 30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణు ప్రజల అర్జీలను స్వీకరించారు ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు
పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామానికి చెందిన రమేష్ తనకు గ్రామ శివారు లో మొత్తం 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, దీనికి పట్టా పుస్తకం సైతం ఉందని, రైతు బంధు పథకం అమలు కావడం లేదని, తనకు రైతు బంధు అమలు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా వ్యవసాయ అధికారిక రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు
రామగుండం మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అనూష తమకు అర్హతలు ఉన్నప్పటికీ గృహ జ్యోతి పథకం అమలు కావడంలేదని, గృహ జ్యోతి పథకం అమలు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎస్ఈ విద్యుత్ శాఖ అధికారిక రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు
పెద్దపెల్లి పట్టణంలోని తాజ్ కాలనీ రోడ్డు కు చెందిన అస్మిత్ జహన్ తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


