TRINETHRAM NEWS

Trinethram News : Mar 29, 2024,

జనసేన తరుపున ప్రచారం.. నటి అనసూయ క్లారిటీ
రానున్న ఎన్నికల్లో జనసేనకు తాను ప్రచారం చేస్తానని చెప్పినట్లు వస్తున్న వార్తలపై నటి అనసూయ స్పందించారు. ‘నేనే ఏం మాట్లాడినా వివాదం చేస్తున్నారు. జనసేన పార్టీకి నా అంతట నేను ప్రచారం చేస్తానని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడనేది నా ఉద్దేశం. ఆయన అడిగితే మద్దతు ఇస్తానని చెప్పా. అంతే కానీ ప్రచారం చేస్తానని చెప్పలేదు. మంచి లీడర్లు ఏ పార్టీలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తా’ అంటూ అనసూయ క్లారిటీ ఇచ్చారు.