Action should be taken against private schools
Trinethram News : ఇష్టా రాజ్యాంగ అడ్మిషన్లు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
యన్ యస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్
ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
విద్య మాఫియా పై పోరాటం చేస్తాం
ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ స్కూల్ ను సీస్ చేయాలి
పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వానిబంధనలు తుంగలో తొక్కుతో పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న నారాయణ విద్యా సంస్థలు
అనంతపురం నగరంలో అక్రమ అడ్మిషన్లు పాఠ్య పుస్తకాల అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి అని యన్ యస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సెలవు దినాల్లో ముందస్తు అడ్మిషన్లు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ పాఠశాలల పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు అదేవిధంగా అనంతపురం నగరంలో విద్యా నిబంధన జీవో నెంబర్ 1ని పాటించకుండా వారి ఇష్టా రాజ్యాంగా అడ్మిషన్లు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి రంగు రంగు కరపత్రాలతో విద్యార్థులను మోసం చేసి అడ్మిషన్ అయ్యాక వారి నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రుల రక్తం పీల్చుకొని తాగుతున్నారు.
సరైన నియమాలు పాటించని అటువంటి కార్పొరేట్ పాఠశాలల పై విద్యాశాఖ అధికారులు కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాల నందు అన్ని వసతులు ఉన్నాయని నమ్మించి మోసం చేస్తున్నారు. వాటి పైన పాఠశాల నందు చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో నెంబర్ 1 ప్రకారం విద్యా సంవత్సరం పూర్తి అయ్యాక అడ్మిషన్లు చేయాలి కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కి మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు.
అని విచ్చల విడిగా అడ్మిషనులు ప్రచారాలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో పాఠశాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని వారు కోరారు..ఈ కార్యక్రమంలో నవీన్, మహేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App