TRINETHRAM NEWS

సామాజిక సేవే మా ధ్యేయం – ప్రజా సేవే మా లక్ష్యం : జాటోత్ దవిత్ కుమార్ (అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి)

Trinethram News : లింగాపూర్ : ఆసిఫాబాద్ నియోజకవర్గం, లింగాపూర్ మండల కేంద్రంలోని సామాన్య నిరుపేద దంపతులు రాథోడ్ పతికా బాయి విజేశ్ దంపతుల కుమార్తె రాథోడ్ బబితా వివాహానికి ఆర్థిక భరోసాగా లింగాపూర్ అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సభ్యులు అండగా నిలిచారు. అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ గౌరవ సభ్యులు రాథోడ్ భీంరావ్ (రిటైర్డ్ E.E, I.T.D.A ఉట్నూర్), జాధవ్ సుశీల్, జాధవ్ అనిల్ (జూనియర్ పంచయత్ సెక్రటరీ), రాథోడ్ సంతోష్, జాధవ్ మారుతీ, రాథోడ్ పాండురంగ్ (కానిస్టేబుల్), డాక్టర్ రాథోడ్ రాజ శేఖర్, పవార్ దినేష్, పవార్ ధనరాజ్, ఆడే ప్రవీణ్ కుమార్ (ఎన్.ఆర్.ఐ దుబాయ్), జాధవ్ అజయ్, జాధవ్ ధరంతేజ్, ఆడే సురేష్ కుమార్ (బీజేపీ మండల అధ్యక్షులు లింగాపూర్ మండలం) సహకారంతో సోమవారం లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ కుమార్ చేతుల మీదుగా 10,000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

హెల్పింగ్ హాండ్స్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడాలనే మానవతా దృక్పధంతోనే ఈ సహాయాన్ని అందించడం జరిగిందనీ లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ అన్నారు. ఆడపిల్లలను భారంగా భావించవద్దని, స్వచ్చంద సామాజిక సేవకులు నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాగా ముందుకు రావాలన్నారు. కుటుంబ సభ్యులు అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాటోత్ రాహుల్, చవాన్ విజేష్, జాధవ్ ఆకాశ్, చవాన్ విశాల్, పవార్ ప్రవీణ్, ఆడే సుశీల్, రాథోడ్ వంశీ, పుర్క సాయి కుమార్ తదితరులు ఉన్నారు…!!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Abhyudaya Helping Hands Foundation