TRINETHRAM NEWS

రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన

సమగ్ర ఇంటి ఇంటి సర్వే పట్ల విస్తృత స్థాయి సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా ఆయాల్లా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే మన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా కుల గణన చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలతో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ అధ్యక్షతన కుల గణన పై వివిధ కులాల బీసీ, ఎస్సి, మైనార్టీ, సంఘాల నాయకులతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో, ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ

కులగణన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసిన ఎస్సి, బీసీ , మైనార్టీ, సంఘాల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు

తెలంగాణలో సరికొత్త విధానంతో సర్వే చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి సర్వే చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులకు ట్రైనింగ్ కూడా ఇచ్చింది.
నవంబర్‌ 6వ తేదీ నుంచి ఈ సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది. ఇదిలా ఉండగా కులగణన చేయడం వల్ల బీసీల్లో పెను మార్పులు రాబోతున్నట్లు మక్కన్ సీంగ్ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కులగణన చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇంట్లో కేవలం ఒక్క వ్యక్తి ఇంటి పెద్ద ఉంటే సరిపోతుంది. ఈ సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు ప్రధానంగా మీ ఆర్థిక స్థితి, ఏ పనిచేస్తున్నారు, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎన్ని పథకాల్లో అర్హులు కలిగి ఉన్నారు. మీకు ఎన్ని విధాలుగా ఆదాయం సమకూరుతుంది. ఇంట్లో ఎంత మంది చదువుతున్నారు? ఎక్కడెక్కడి నుంచి ఆదాయం సంపాదిస్తున్నారు అడుగుతారు. ఈ వివరాలను గోప్యంగా ఉంచుతారు

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App