జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 02 at 16.29.20

TRINETHRAM NEWS

సింగరేణిలో ఉద్యోగం సాధించిన ఫోటోగ్రాఫర్ బిడ్డ.. !

స్టేట్ రెండవ ర్యాంక్ సాధించి ఫిట్టర్ ఉద్యోగం పొందిన శివ…!

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలో గత 30 సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్ వృత్తిలో కొనసాగుతున్న మోత్కు శ్రీనివాస్- మాధవి ల కుమారుడు శివ సింగరేణిలో ఫిట్టర్ ఉద్యోగం సాధించి యువతకి ఆదర్శంగా నిలిచారు.
తల్లితండ్రులు నిరుపేద ఫోటోగ్రాఫర్ వృత్తిలో కొనసాగుతూ ఉన్నత స్థానంలో చూడాలని కుమారుడు శివను హైదరాబాదులో కోచింగ్ ఇప్పించారు. గత నెల 6న జరిగిన సింగరేణి ఫిట్టర్ ఉద్యోగాల పరీక్షల్లో
90శాతం మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ పోంది ఫిట్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో యువతకి ఆదర్శంగా నిలిచి సింగరేణి ఫిట్టర్ ఉద్యోగం సాధించడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page