జూలై 17, 2026

WhatsApp Image 2024 11 19 at 20.33.45

TRINETHRAM NEWS

ప్రేమికుడే బ్రోకర్ …

స్నేహితులకు ప్రియురాలి అప్పగింత

విశాఖ త్రీ ఈడియట్స్ గ్యాంగ్ రేప్

ప్రియుడే నయవంచకుడిగా మారాడు. ప్రియురాలి పై తన స్నేహితులతో అత్యాచారం జరిపించాడు. ఈ గ్యాంగ్ రేప్ తో ఆమె అవమానభారంతో కృంగిపోయింది. ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించి, బెదిరించి మళ్ళీ తమ కోర్కెను తీర్చాలని వేధించటంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన తండ్రి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని అసలు విషయం అడుగగా ఆమె జరిగిందంతా చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు.

ఇక వివరాల్లోకి వెళ్తే..
విశాఖ జోన్ 2 ప్రాంతానికి చెందిన లా విద్యార్థిని తన సహ విద్యార్థితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ శరీకంగా ఒకటయ్యారు. ఆ తర్వాత దాబాగార్డెన్స్ వద్దకు ఆమెను రప్పించాడు. తన ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లి ఆమెతో శారీరకంగా కలిసాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రియుడి స్నేహితులు ముగ్గురు ఆమె ను బలవంతం చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీంతో ఆమె అవమాన భారంతో కృంగిపోయింది. ప్రియుడే దగ్గరుండి తన స్నేహితులతో మూకుమ్మడి అత్యాచారం చేయించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తన ప్రియుడుని నిలదీసి అడిగింది. కానీ అతను ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని స్నేహితులు తమ వద్దకు రావాలని ఆమెను బెదిరించటం ప్రారంభించారు. ఆమెతో కలిసినప్పుడు తీసిన వీడియో లను బయట పెడతామని ఆమెను బెదిరించారు. ఈ వేధింపులకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అది గమనించిన తండ్రి ఆమె ప్రయత్నాన్ని నిలువరించి అసలు విషయం అడగడంతో ఆమె జరిగిందంతా చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగింది టూ టౌన్ లిమిట్స్ లో కావడంతో ఆ పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు టూ టౌన్ సీఐ కి, ఏసీపీ కి పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. నిందితుల కోసం ముమ్మరం గా గాలింపు చేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురు లా స్టూడెంట్స్ కాగా, మరో నిందితుడు వరుణ్ మోటర్స్ లో క్యాషియర్ గా పని చేస్తున్నాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page