జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 29 at 8.53.16 AM

TRINETHRAM NEWS

Medigadda Dam: నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం..

Kaleshwaram Project: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా పోయింది..

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేసిన తర్వాత మేడిగడ్డ డ్యామ్ 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో దగ్గరకు వెళ్లి చూస్తారు. ఈ పిల్లర్లు కుంగిపోవడం వల్ల తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తారు. అలాగే, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇందు కోసం నీటి పారుదల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు..

You cannot copy content of this page