ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు రాజకీయ సమాధి కట్టడమే అంబేద్కర్ కి ఘనమైన నివాళి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జాతిపిత, రాజనీతిజ్ఞుడు, భారత దేశ మొదటి న్యాయ శాఖమంత్రి,రాజకీయవేత్త, ఆర్థికవేత్త డా. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ ఘన నివాళి అర్పించడం జరిగింది.
జిల్లా కన్వీనర్ రవీందర్ మాట్లాడుతూ అంబేద్కర్ అంతిమ లక్ష్యం BC_ST_SC ప్రజలు రాజ్యాధికారం సాధించడమే,అంబేద్కర్ కి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. అంబేద్కర్ కలలు కన్న అశోక రాజ్యాన్ని నిర్మించడం కోసం బలహీన వర్గాల ప్రజలు ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వంలో చేరి పోరాటం చేయాలనీ తెలియజేసారు. దాని కోసం అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ ఆశయ సాధకులు, ప్రజా సంఘాలు, అగ్రకుల పేదలు,ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాలని రవీందర్ మహారాజ్ తెలియజేసారు. అంబేద్కర్ BC_ST_SC దేవుళ్ళ కోసమే పార్లమెంట్, అసెంబ్లీ ఏర్పాటు చేశాడు, ఆ పార్లమెంట్ సింహాసనం బలహీన వర్గాలు సొంతం చేసుకోవాలి దాని కోసమే అంబేద్కర్ పోరాడి మరణించారు అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App