Boy Shot : తోటి విద్యార్థిపై ఐదేండ్ల బాలుడి కాల్పులు

TRINETHRAM NEWS

A five-year-old boy shot at a fellow student

Trinethram News : Bihar : Aug 01, 2024,

బీహార్‌లోని సుపౌల్‌ జిల్లా లాల్‌పత్తిలో ఐదేళ్ల బాలుడు మరో బాలుడిపై కాల్పులు జరిపాడు. ఎస్పీ శైశవ్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో నర్సరీ విద్యార్థి (5) బుధవారం తన బ్యాగులో ఓ హ్యాండ్‌ గన్‌ పెట్టుకుని పాఠశాలకు వెళ్లాడు. అదే బడిలో మూడో తరగతి చదువుతున్న పదేండ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. ఆ బాలుని చేతికి గాయమైంది. బాలుడిని వెంటనే దవాఖానకు తరలించారు. ఈ బాలుని వద్దకు తుపాకీ ఎలా వచ్చింది? అనే అంశాలపై దర్యాప్తు జరుగుతున్నది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A five-year-old boy shot at a fellow student!

You cannot copy content of this page

Scroll to Top