జూలై 23, 2026

WhatsApp Image 2024 01 25 at 11.15.37 AM

TRINETHRAM NEWS

కోటబొమ్మాళి లో చిన్నారి పై లైంగిక దాడి చేసిన సొంత తాత

అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల మనవరాలిపై సొంత తాత అత్యాచారానికి పాల్పడిన ఘటన కోటబొమ్మాళి మండలంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటన బుధవారం బయటపడింది.

ఎస్సై షేక్ మీర్ మహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధుడు, ఆయన కుమారుడు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 19న కుమారుడు తన ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఇంటికి వచ్చి బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అదే రోజు మధ్యాహ్నం మనవరాలి పై తాత అఘాయిత్యానికి పాల్పడగా పెద్దగా ఏడుస్తున్న బాలికను నాన్నమ్మ వారించింది. ఏడిస్తే వాతలు పెడతానని హెచ్చరించినప్పటికీ బోరున ఏడవడంతో వృద్ధుడు మనవరాలిని వదిలేశాడు.

మరుసటి రోజు పాపకు స్నానం చేసేందుకు తల్లి వస్త్రాలు తీయడం, అవి రక్తంతో ఉండటంతో చిన్నారిని ప్రశ్నించగా ఘోరం బయట పడింది. విషయం భర్తకు చెప్పినా పరువు పోతుందని ఆయన వారించడంతో అంతా ఊరుకున్నారు. 22న పాఠశాలలో ఉండగా బాలికకు కడుపునొప్పి రావడంతో ఇంటికి వచ్చి మందులు వేశారు. తిరిగి బుధవారం నొప్పి మరింత ఎక్కువ కావడంతో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పోలీసులకు సమాచారం అందడంతో వారు వివరాలు సేకరించారు. చిన్నారిపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లి నుంచి రాతపూర్వకంగా వివరాలు సేకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి పేర్కొన్నారు.

You cannot copy content of this page