TRINETHRAM NEWS

ఖనిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి

శానిటేషన్ సూపర్ వైజార్లు మరియు వర్క్ ఇన్స్పెక్టర్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి

ర్యాగ్ పిక్కర్స్ కి 15వేల వేతనాలు అమలు చేయాలి

నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రజవాణిలో కోరిన మద్దెల దినేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరిఖని లోని పలు సమస్యల పై సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరెట్ లో నిర్వహించిన ప్రజావానిలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షలు మద్దెల దినేష్ సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతు రామగుండం నగర పాలక సంస్థలోని దాదాపు 60వేల గృహాలకు పైగ ఉన్నపటికీ ప్రతి ఇంటి నుండి 8% శాతం సెస్ కు పన్నుల రూపకంగా చేలిస్తున్నారని కవున ఖనిలో ఎప్పటి నుండో పోరాడుతున్న సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలన్న కనీసం పాలకులు అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
ఎంతో మంది వివిధ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లకు వలస పొతున్నారని సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉపయోగ పడుతుందని అన్నారు. అదే విధంగా రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుద్ధ్య సూపర్వైజర్లు, మరియు వార్క్ ఇన్స్పెక్టర్ల వేతనాలు కావలిసికొని ఆపడం ఏంటి అని ప్రశ్నించారు.
ఇది ఒక ప్రయివేట్ సంస్థ కాదని గుర్తు ఉంచుకోవాలని కొంత మంది అధికారులకు తెలుకోవాలని హితువు పలికారు. అధికారులు ఆదేశాల మేరకు కష్టపడి పనిచేస్తున్న సూపర్వైజర్ల వేతనాలు మరియు వర్క్ ఇన్సపెక్టర్ల వేతనాలు ఆపండని ఒకరరిద్దరూ అధికార పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు చేపితే వారికి అనుకూలంగా అధికారులు పనిచేస్తు సిబ్బంది ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని విమర్శించారు ఇప్పటికైనా అధికారులు తీరు మారి అధికార పార్టీ నేతల మాటలు వినకుండా కష్టపడి పనిచేస్తున్న వారిని ప్రోత్సహించి వారి శ్రమను దోచుకోకుండ వారి వేతనాలు వెంటనే ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేసారు అదే విధంగా ర్యాగ్ పిక్కర్స్ 20 ఏండ్లకు పైగా పనిచేస్తున్న కార్మికులకు ఇంటి ఇంటి కి వెళ్లి చెత్త సేకరింస్తే నెలకు 4వేల రూపాయలు ఇస్తే ఏమి సరిపోతుందని అయిన ఆవేదన వ్యక్తం చేసారు.
ఇప్పటికైనా నగర పాలక సంస్థ ర్యాగ్ పిక్కర్సను అవుట్ సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి వారికి కూడా నెలకు 15వేల రూపాయల వేతనాలు ఇవ్వాలని కోరారు. నగర పాలక సంస్థ కు స్పెషల్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించిన జిల్లా కాలెక్టర్ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని వారు దినేష్ కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App