జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 24 at 07.58.12

TRINETHRAM NEWS

బిగ్​బాస్​ గంగవ్వపై కేసు నమోదు

Trinethram News : బిగ్​బాస్​ అభ్యర్థి, మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలక జోస్యం వీడియో గంగవ్వ కు సమస్య తెచ్చిపెట్టింది. యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదు మేరకు వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు. గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై ఈ కేసు రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఈ వీడియోపై జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త ఆదులాపురం గౌతమ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో యూట్యూబర్ రాజు 25 వేల రూపాయలు ఫైన్ చెల్లించినట్లుగా తెలుస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page