జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Happy Father's Day

దేవరకొండ డివిజన్ జూన్ 20, త్రినేత్రం న్యూస్.

Happy Father’s Day : నేడు ఫాదర్స్ డేశుభాకాంక్షలు కుటుంబం అనే వ్యవస్థకు తండ్రి ఒక మూల స్తంభం. తల్లి ప్రేమకు, ప్రతిరూపమైతే ,తండ్రి బాధ్యతలకు ప్రతీక .సమాజంలో వస్తున్న మార్పులు కుటుంబ వ్యవస్థ జీవన విధానం ఉపాధి అవకాశాలు, విద్యావిధానాలు, సాంకేతికత ,సామాజిక విలువలు మారుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్ )ప్రభావంతో ప్రపంచం ఒక కు గ్రామంగా మారింది .ఈ మార్పు వల్ల, ఈ మార్పు మధ్యన తండ్రి పాత్ర ,బాధ్యతలు ,కర్తవ్యాలు సవాళ్ళు కూడా విస్తరించాయి. ఫాదర్ఫ్ డే@సందర్భంగా నాడు నేడు భవిష్యత్తులో తండ్రి పాత్రను పరిశీలించడం సమాజానికి అవసరం.
గతంలో తండ్రి కుటుంబానికి ప్రధాన పోషకుడు రక్షకుడు నిర్ణయాధికారి కష్టపడి పనిచేయడం, పిల్లలకు సంస్కారం ,క్రమశిక్షణ నేర్పించడం, కుటుంబ సంప్రదాయాలు విలువలు కాపాడటం ఆస్తులు జీవనోపాధిని సంరక్షించడం సమాజంలో కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం. నాడు తండ్రి సంపాదన పరిమితమైనప్పటికీ కుటుంబ బంధాలు బలంగా ఉండేవి పిల్లలతో ప్రత్యేక్ష్ అనుబంధం ఎక్కువగా ఉండేది. ప్రపంచీకరణ వల్ల తండ్రికి ఎదురవుతున్న సవాళ్లు, ఆర్థిక ఒత్తిడి, సమయ నిర్వహణ, డిజిటల్ యుగ ప్రభావం, విలువల పరిరక్షణ ,మానసిక ఒత్తిడి. పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా ఖర్చులు ,వైద్య ఖర్చులు తండ్రి పై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. ఉద్యోగం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి రావడం వలన కుటుంబానికి సమయం తగ్గుతుంది.
సోషల్ మీడియా ,మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ ప్రపంచం పిల్లలపై చూపుతున్న ప్రభావాన్ని నియంత్రించడం సవాలుగా మారింది. ప్రపంచ సంస్కృతుల ప్రభావం మధ్య భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను కాపాడటం అవసరమైంది. ఉద్యోగ భద్రత, కుటుంబ భవిష్యత్తు, ఆర్థిక ప్రణాళిక, వంటి అంశాలు మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి.
తండ్రి సంపాదించే వ్యక్తిగా నే కాకుండా జీవిత మార్గదర్శక ఉండవలసిన అవసరం పెరుగుతుంది. పిల్లలకు జీవిత నైపుణ్యాలు నేర్పించడం సరైన నిర్ణయాలు ,సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం, ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పిల్లలకు అలవాటు చేయడం. కుటుంబానికి భద్రత కల్పించడం, పిల్లలకు మంచి విద్య అందించడం సంస్కారం విలువలు నేర్పించడం, కుటుంబ సభ్యులకు భావోద్వేగ మద్దతు ఇవ్వడం సమాజానికి ఉపయోగపడే పౌరులను తయారు చేయడం. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను అభివృద్ధి చేసుకోవడం కుటుంబ ఐక్యతను కాపాడడం అవసరం.
తండ్రి జీవితంలో ఎక్కువగా మాట్లాడకపోవచ్చు. కానీ తన కుటుంబం కోసం ఎక్కువ ఆలోచిస్తాడు. తన పిల్లల కలలను, భవిష్యత్తును ,తన భవిష్యత్తుగా భావించి నిరంతరం శ్రమిస్తాడు. తన బాధలను దాచిపెట్టి కుటుంబం సంతోషం కోసం కష్టపడతాడు. తండ్రి ఒక వ్యక్తి కాదు, ఒక బాధ్యత ,ఒక భరోసా, ఒక కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించే జీవన మార్గదర్శి. ప్రపంచీకరణ యుగములో మార్పులు ఎన్నో వచ్చిన తండ్రి ప్రేమ, త్యాగం, బాధ్యత కర్తవ్యాల విలువ ఎప్పటికీ మారదు.
నాడు కుటుంబాన్ని నిలబెట్టిన తండ్రి నేడు కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. రేపు సమాజాన్ని నిర్మించే తరాన్ని తీర్చిదిద్దే శక్తిగా నిలువబోతున్నాడు. అందువల్ల ప్రతి తండ్రి తన కుటుంబానికి వెన్నెముక, సమాజానికి ఆదర్శం ,దేశ భవిష్యత్తుకు నిర్మాత.
నాకు జన్మనిచ్చిన నా తల్లి, నా తల్లి అమరజీవికి సామాజిక విప్లవ జోహార్లు. నా తండ్రికి పాదాభివందనాలతో…
ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి తండ్రికి హృదయపూర్వక అభివందనాలతో శుభాకాంక్షలు
మీ కామేపల్లి లక్ష్మయ్య.
సామాజిక వైద్యులు.
9542311846.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page