జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Distribution Free Textbooks

చెరుకుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా నూతన విద్యాసంవత్సరం ప్రారంభం.

Distribution Free Textbooks : డిండి (గుండ్ల పల్లి) జూన్ 15, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సోమవారం నూతన విద్యాసంవత్సరం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. మొదటి రోజే విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గెజిటెడ్ హెడ్మాస్టర్ ఇస్లావత్ గోప్య నాయక్, మరియు పంచాయతీ కార్యదర్శి చిరంజీవి విచ్చేశారు. ఈ సందర్భంగా గెజిటెడ్ హెడ్మాస్టర్ గోప్య నాయక్ మాట్లాడుతూ…విద్యార్థులంతా మొదటి రోజు నుంచే క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను, నాణ్యమైన విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జీ హెడ్మాస్టర్ భూక్య నాగేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన పుస్తకాలను అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం వ్యక్తమైంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page