జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Student Suffers Electric Shock

ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి.
బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

Student Suffers Electric Shock : దేవరకొండ డివిజన్ జూన్ 15, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా దేవర కొండ నియోజకవర్గం కొండమల్లెపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీధర్ నిర్లక్ష్యం వల్ల విద్యార్ది నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన రామ్ చరణ్ కు విద్యుత్ షాక్ కి గురి కావడం జరిగింది అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.సోమవారం దేవరకొండ పట్టణంలోని సంజీవ ఆసుపత్రిలో విద్యుత్ షాక్ తో చికిత్స పొందుతున్న రామ్ చరణ్ ను బిఆర్ఎస్వీ నాయకులు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. రామ్ చరణ్ కి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయుని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్ధికి విద్యుత్ షాక్ రావడం జరిగింది అని ఆయన తెలిపారు. ఉపాద్యాయులు విద్యార్థులతో పని చేయించ వద్దు అని ఆయన అన్నారు. ప్రభుత్వం నిబంధనలు పాటించక పోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్వీ నాయకులు జమీర్ బాబా,అనిల్ తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page